TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేడారం జాతరలో కేసీఆర్..మళ్లీ జాతరకు తెలంగాణ

Published on: Thu Feb 9, 2012 2:31PM

మేడారం: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం మేడారంలో సమ్మక్క-సారలక్కలను దర్శించుకున్నారు. కేసీఆర్ దంపతులు హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన 48 కిలోల బంగారాన్ని సమర్పించుకున్నారు. ఈ జాతరలో  కేసీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. జాతరలో ఓ భక్తుడు విసిరిన కొబ్బరికాయ తగిలి ఆయన గాయపడ్డారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న కెసిఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మళ్లీ జాతర వచ్చేనాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతర నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జాతర నిర్వహణకు 250 కోట్ల రూపాయలు కేటాయించి, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులకు, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా మేడారం చేరుకున్నారు.

మేడారం జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వచ్చారు. దీంతో మేడారం జనసంద్రమైంది. బుధవారం సమ్మక్క, సారలమ్మ జాతరలో కీలకమైన ఘట్టం ఉంటుంది. సమ్మక్క గద్దెనెక్కుతుంది. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు శానససభ్యుడు చిరంజీవి కూడా తులాబారం వేయించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ సతీసమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరకు ఏర్పాట్లు మెరుగు పడ్డాయని ఆయన చెప్పారు. జాతరకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.