TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ సెంటిమెంట్ తోనే ఉపఎన్నికలకు దూరం

Published on: Mon Jan 2, 2012 10:40AM

విశాఖపట్నం: టిఆర్ఎస్‌తో తమకు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొణతాల రామకృష్ణ విశాఖ జిల్లాలో స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా రాజీనామా చేయడంతోనే తాము ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. ప్రస్తుతం టిఆర్ఎస్‌తో తమకు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని అయితే భవిష్యత్తులో పొత్తులపై అప్పటికప్పుడే నిర్ణయించుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని కొండా సురేఖ చిత్తూరు జిల్లాలో అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.