'కెసిఆర్ నిజాం వారసుడిలాగా ప్రవర్తిస్తున్నారు'
Published on: Tue Dec 20, 2011 3:21PM
హైద
రాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నిజాం వారసుడిలాగా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. దీనిని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. టిడిపి తెలంగాణ ఫోరం సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ నాటకాలకు తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణ ఏమైనా కెసిఆర్ జాగీరా అని వారు ప్రశ్నించారు. టిఆర్ఎస్ వారు తెలంగాణ ద్రోహులని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న తాము మాత్రమే అసలైన తెలంగాణవాదులమని చెప్పారు.తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకున్న డిసెంబరు 23ని విద్రోహ దినంగా పాటిస్తామని చెప్పారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టిడిపి పోటీ చేస్తుందని చెప్పారు. ఈనెల 28న చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనని రద్దు చేశారు.


