జడ్జికే శిక్ష పడింది...


త్రిపురలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. న్యాయం చెప్పి శిక్షలు విధించే జడ్జికే శిక్ష పడింది. అసలు సంగతేంటంటే..  2014 జూన్‌ 6వ తేదీన జడ్జి మోటోమ్‌ డెబ్బార్మా మద్యం సేవించి  డ్రైవింగ్ నడిపిన కేసులో భాగంగా ఆయనకు శిక్షపడింది. మద్యం సేవించి ప్రమాదకర పరిస్థితిలో వాహనం నడిపినట్లు విచారణలో తేలడంతో త్రిపుర హైకోర్టు శిక్ష విధించింది. ఆయన జీతంలో రెండు ఇంక్రిమెంట్లు ఆపాలని నిర్ణయించింది. కాగా నేరం జరిగిన సమయంలో డెబ్బార్మా సెపాహిజాలా జిల్లాలోని బిశాల్‌గఢ్‌లో సివిల్‌ జడ్జి, జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌(ఫస్ట్‌ క్లాస్‌)గా పనిచేశారు. ప్రస్తుతం నార్త్‌ త్రిపుర జిల్లాలోని కాంచనపూర్‌లో సబ్‌డివిజినల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌, సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.