TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హత్యలను కూడా ఎంజాయ్ చేయాలి.. నోరు జారిన సీఎం.

Published on: Fri Jul 6, 2018 4:34PM

 

ఈ మధ్య వాట్సాప్‌లో వస్తున్న ఫేక్ మెసేజ్‌ల పుణ్యమా అని చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.. త్రిపురలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి..  గత వారంరోజుల్లో ముగ్గురు వ్యక్తులు వాట్సాప్‌ రూమర్లకు బలయ్యారు.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేబ్ ను మీడియా ప్రతినిధులు 'రాష్ట్రంలో జరుగుతున్న వరస హత్యలపై మీ సమాధానమేంటి' అని అడిగారు.. ఆయనికి అర్ధం కాలేదో లేక కావాలనే అలా చెప్పారో తెలీదు కానీ ఒక తలతిక్క సమాధానం చెప్పారు.. ప్రస్తుతం త్రిపురలో సంతోషం, ఆనందం రాజ్యమేలుతున్నాయని చెప్పిన బిప్లవ్.. వీటిని కూడా ఎంజాయ్ చేయాలి అన్నారు.. అంతేకాదు తాను ఎంత సంతోషంగా ఉన్నానో..

తన ముఖం చూస్తే తెలుస్తుంది అన్నారు.. ఇంకేముంది ఈ వ్యాఖ్యలకి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.. దీంతో త్రిపుర ప్రభుత్వం 'చేతులు కాల్చాక బర్నాల్ రాసినట్టుగా' దిద్దుబాటు  చర్యలు మొదలుపెట్టింది.. త్రిపురలో ఎయిర్‌పోర్ట్‌కు మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిషోర్ పేరు పెట్టడంపై చాలా సంతోషంగా ఉన్నారని.. ఆయన అదే మూడ్‌ నుంచి ఇంకా తేరుకోలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చేసిన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరించాయని స్పష్టం చేసింది.. అందుకే అంటారు.. నలుగురిలో ఉన్నోడు, నలుగురిని నడిపించేవాడు ఆచి తూచి మాట్లాడాలని.