TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

త్రిపురలో బీజేపీ ఆధిక్యత..కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు..

Published on: Sat Mar 3, 2018 12:32PM


త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎప్పుడూ లేని విధంగా త్రిపురలో జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. కమ్యూనిస్టుల కంచు కోట బీజేపీ దెబ్బకు బద్దలవుతోంది.  మొత్తం 59 స్థానాలు ఉన్న త్రిపురలో.. భాజపా, ఐపీఎఫ్‌టీ కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలోని వామపక్ష పార్టీల కూటమి 16 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యతను సాధించకుండా డీలా పడింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మొత్తం రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేస్తాయని అన్నారు.