TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాపం... ఆ 54 మందీ....

Published on: Mon Aug 17, 2015 12:25PM

 

అయ్యో... అందరూ భయపడిందే జరిగింది... ఆ 54 మందీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇండోనేసియా విమానాల ప్రాణ దాహానికి మరో 54 మంది బలైపోయారు. ఇండోనేసియాలో 54 మందితో ప్రయాణిస్తు్న త్రిగానా ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఆచూకీ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ విమానానికి సంబంధించి సేఫ్‌గా వుందనే వార్త వింటామని ఎదురుచూస్తున్న వారందరికీ పిడుగులాంటి వార్త తెలిసింది. ఆ విమానం కూలిపోయిందని, విమానంలో ప్రయాణిస్తున్న ఎవరూ బతికి లేరని త్రిగానా ఎయిర్ వేస్ ప్రతినిధులు ప్రకటించారు. ఈశాన్య పపువా ప్రాంతంలోని ఓస్కిబీ జిల్లాలో ఒక మారుమూల ప్రదేశంలో విమాన శకలాలను గుర్తించామని తెలిపారు. ప్రయాణికులలో ఐదుగురు చిన్నారులు కూడా వున్నారు. అసలు ఇండోనేసియా విమానాలే తరచుగా ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వుంది.