ఎవరు చెప్పినా వినని జగన్ కి 'స్టే' షాక్ !

 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా అయినా చంద్రబాబుని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కేంద్రం వద్దని చెప్పినా జగన్ విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష చేపట్టారు. కేంద్రం వద్దని వారించినా, ఫిచ్ లాంటి సంస్థలు ఇబ్బంది పడతారని హెచ్చరించినా మంకు పట్టు పట్టి మరీ వెనక్కి తగ్గని జగన్ సర్కార్ మీద విద్యుత్ కంపెనీలు రివర్స్ అవుతున్నాయి. జగన్ ఎప్పుడైతే విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించాలని భావించారో అప్పుడే కేంద్రం వద్దని వారించింది. 

పీపీఏలను పునఃసమీక్షించడం వల్ల పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడుతుందని కేంద్ర శక్తి వనరుల శాఖ జగన్ కు లేఖ రాసి హెచ్చరించింది. అయినా ఆ విషయాలు చెవికేక్కించుకొని జగన్ రెనివెబుల్ ఎనర్జీ డెవలపర్స్ తో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పిపిఎలపై) విచారణకు ఓ కమిటీని వేసి సదరు కంపెనీ లకు కొనుగోలు ధర తగ్గించాలని నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వాలు చేసుకునే ఒప్పందాలు ఏవైనా సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే జరుగుతాయని అలా జరిగిన ఒప్పందాల్లో అవినీతి జరగడం అనేది ఉండదని చెప్పినా కొనుగోలు ఒప్పందాలపై పునసమీక్ష చేసి తీరాలని ఫిక్స్ అయ్యారు.

 అందుకే కమిటీ ఏర్పాటు చేసి రేట్లు తగ్గించాల్సిందేనని ఏపీ సర్కార్ కొన్ని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12నే విద్యుత్ కంపెనీలకు నోటీసులు జారీ చేసిన ఆ విషయం బయట రాలేదు. కానీ అలా నోటీసులు అందుకున్న కంపెనీల్లో గ్రీన్‌కో అనే కంపెనీ మాత్రం ట్రిబ్యునల్‌ కి వెళ్లి మరీ షాకిచ్చింది. ట్రిబ్యునల్ లో వెళ్ళడంతో గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది. ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని గ్రీన్‌కో కంపెనీ తేల్చేసింది. రాజస్తాన్‌లో రూ.2.44కి యూనిట్‌ ఇచ్చినంత మాత్రాన ఏపీలో అదే ధరకు ఇవ్వడం కుదరదని గ్రీన్‌కో కంపెనీ స్పష్టం చేసింది.