TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ద్రౌపది వ‌స్త్రాప‌హ‌ర‌ణం మించిన సీన్.. ఎక్కడో తెలుసా..? 

Published on: Tue Jun 15, 2021 11:19AM

ఎవరైనా తప్పు చేస్తే.. మందలించాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ తప్పు చేస్తే ఆ తప్పును సరి చేసుకోమని టైం ఇవ్వాలి.. ఆ తప్పు వల్ల కలిగే అనార్ధాలు వివరించాలి.. తప్పు చేస్తే వెంటనే దోషింది.. దూషించ కూడా ఆ తప్పుకు గల కాగణాలు ఏంటో తెలుసుకోవాలి.. మళ్ళీ ఆ తప్పును జరగకుండా చూసుకోవాలి.. తప్పు ఎప్పుడు ఎప్పుడు ముందు నడిపించేదిగా ఉండాలి కానీ అదే పనిగా తప్పుడు మార్గం లో నడిచేలా చేయకూడదు.. ఇంతకీ ఈ తప్పు గురించి ఎందుకు చెపుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరే తెలుసుకోండి..? 

ఆమెకు  పెళ్లి అయింది. ఆరు నెలల కిందట భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంటి నుంచి బయటకువెళ్లిపోయిన ఓ మహిళ తిరిగి వచ్చింది. వారం రోజుల కిందట ఆమె తిరిగిరాగా.. గ్రామంలోని యువకులు ఆమెపై దాడిచేశారు. ఇంతకీ ఏం జరిగింది..? ఎలా జరిగింది..? అని తెలుసుకోవాలంటే వార్తలో ముందుకు వెళ్ళండి.. భర్తను వదిలేసి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఆ గ్రామంలోని యువకులు  ద్రౌపది వస్త్రాభరనాన్ని మించిన సీన్ క్రియేట్ చేశారు.. ఆ మహిళను ఇంట్లో నుండి  ఈడ్చుకొచ్చారు. విస్త్రను చేశారు. ఆ తర్వాత ఊరేగించారు. అక్కడితో ఆగక ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఆదివారం వెలుగులోకి రావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ సంఘటనకు ప్రత్యేక కారకులైన  11 మంది నిందితుల్లో ఆరుగుర్ని సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు కనిపించకుండాపోయినా వీడియో బయటకు వచ్చేవరకూ ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అనంతరం కేసు నమోదుచేసిన పోలీసులు.. బాధితురాలు అసోంలోని తన తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత భర్త సమక్షంలో ఫిర్యాదు చేసింది. మొత్తం 11 మంది నిందితుల పేర్లను చెప్పడంతో.. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్ పంచాయతీ పెట్టి పెద్దలు వేసిన శిక్ష కాదని తెలిపారు. కానీ, కొంత మంది యువకులు ఆమెపై హఠాత్తుగా దాడిచేసి అవమానించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సామాజిక కార్యక్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారులు దీనిపై మౌనంగా ఉండటంపై మండిపడుతున్నారు. మహిళకు జరిగిన దారుణాన్ని స్థానిక టీఎంసీ నేత ధిరేశ్ రాయ్ తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ అమానవీయ ఘటన పశ్చిమ్ బెంగాల్‌లోని అలీపూర్దౌర్ జిల్లా కుమరగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 9న చోటుచేసుకుంది.

ఎంత ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఇలాంటి వికృతమైన పనులు చేస్తారా.. ? చెప్పి చూడాలి.. పెద్దవాళ్ళ సమక్షంలో మందలించాలి.. అప్పుడు కూడా వినకపోతే రెండు దెబ్బలు వెయ్యాలి.. అప్పుడు కూడా వినకపోతే ఆమె దారికి ఆమెను వదిలెయ్యాలి. ఎందుకంటే తప్పు చేస్తే ఆ తప్పు వెనక భర్త కూడా ఉండాలి.. అతని అసమర్ధ ఉంటేనే ఏ పెళ్లామైన తప్పు చేస్తుంది.. అని స్థానికులు అక్కడి పెద్దలు వుకుంటున్నారు..