TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మన్యంలో గర్భిణికి ఇబ్బందులు!

Published on: Thu Aug 8, 2024 2:00PM

మన్యం జిల్లాలో ఇటీవలి కాలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. గిరి పల్లెల్లో వున్న గిరిజనులు అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్ళడం చాలా సవాళ్ళతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇలాంటి పరిస్థితిని ఒక గర్భిణి ఎదుర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కిచూరు పంచాయితీకి చెందిన అచ్చెమ్మ అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్.కి ఫోన్ చేశారు. అచ్చెమ్మ ఇంటికి అబులెన్స్ వెళ్తున్న సమయంలో దారి మధ్యలో అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. అంబులెన్స్.ని బయటకి తీయడానికి డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. అదే సమయంలో ఇంటి దగ్గర అచ్చెమ్మకి నొప్పులు పెరిగిపోయాయి. ఒక బిడ్డని కూడా ప్రసవించింది. ఆమె గర్భంలో వున్న మరో కవల శిశువు అడ్డం తిరిగింది. తంటాలు పడి అంబులెన్స్.ని బురదలోంచి బయటకి తీసి, అచ్చమ్మ ఇంటికి వెళ్ళిన 108 సిబ్బందికి అసలు విషయం తెలిసింది. అప్పుడు సిబ్బంది అచ్చమ్మ గర్భంలో వున్న మరో శిశువును కూడా బయటకి తీశారు. అదృష్టవశాత్తూ తల్లి, ఇద్దరు పిల్లలు క్షేమంగా వున్నారు.