TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక కృష్ణుడు... ఇద్దరు రాధలు!

Published on: Wed Nov 30, 2022 11:21AM

సినిమాలలో ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీలు చాలానే చూశాం. ఒకే అబ్బాయిని ఇద్దరమ్మాయిలు ప్రేమించడం.. ఒకరి కోసం ఒకరు త్యాగాలకు సిద్ధపడటం సినిమాలలో చాలా కామన్. దసరాబుల్లోడు నుంచి అంతకు ముందూ, తరువాతా కూడా బోలెడన్ని ట్రయాంగ్యులర్ లవ్ సినిమాలు వచ్చాయి. సెంటిమెంట్ పండి విజయవంతమైన ఫార్ములా ఇది.

అయితే.. వాస్తవంలో ఇలాంటి ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ ఎంత వయలెంట్ గా ఉంటుందో తెలుసా.. ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి కోసం రోడ్డున పడి కొట్టుకున్న ఈ సంఘటన వీళ్లసలు అమ్మాయిలేనా.. అసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఈ ఘటన బీహార్ లోని సోనేపూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే సోనేపూర్ లో  సంత జరుగుతోంది. అబాల గోపాలం ఆ సంతకు వచ్చారు. ఈ సంతకు వచ్చిన ఒక అమ్మాయికి తన ప్రియుడు మరో అమ్మాయితో కలిసి రావడం చూసింద. అంతే ఆగ్రహం పట్టలేక నా లవర్ తో తిరుగుతావా అంటే ఆమెతో గొడవకు దిగింది.

నీ లవరేంటి నా లవర్ అంటూ ఆ అబ్బాయితో వచ్చిన అమ్మాయి కూడా గొడవకు సై అంది. అక్కడ నుంచీ మొదలైంది రచ్చ. అమ్మాయిల మధ్య గొడవ అలా ఇలా జరగలేదు. రచ్చ రచ్చ చేశారు ఇద్దరూ కలిసిజుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బట్టలు చింపేసుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు.

సంతలో ఉన్నవారందరికీ మంచి వినోదం పంచారు. అంతేనా ఒక అబ్బాయి కోసం ఇంత చేటు కొట్టుకుంటున్నారా అని జనం షాక్ అయ్యేలా చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు అమ్మాయిల ముద్దుల ప్రేమికుడు కూడా వారి దెబ్బలాటకు భయపడి జారుకున్నాడు.  చివరాఖరికి పోలీసులు రంగ ప్రవేశం చేస్తే కాని వారి గొడవ ఆగలేదు.