TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ

Published on: Tue Jun 16, 2026 2:43PM

 

మాజీ మంత్రి వై. ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ వై. ఎస్. అవినాష్ రెడ్డి తో పాటు ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ప్రధాన కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

ఇదే కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ వివేకా కుమార్తె వై. ఎస్. సునీత రెడ్డి  దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. సునీత పిటిషన్‌కు వ్యతిరేకంగా నిందితులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లపై కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. కేసు దర్యాప్తు, అదనపు విచారణ అవసరంపై ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.