TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంబటి రాంబాబు ఇక స్పెషల్ రిమాండ్ ఖైదీ.. సదుపాయాల కల్పనకు కోర్టు ఆదేశం

Published on: Tue Feb 17, 2026 1:27PM

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు భారీ ఊరట కలిగించింది తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కావాలంటూ అంబటి దాఖలు చేసుకున్నపిటిషన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. నిబంధనల మేరకు  ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించింది. అలాగే అంబటి రాంబాబును ప్రత్యేక  స్పెషల్ రిమాండ్ ప్రిజనర్ గా పరిగణించాలని సూచించింది.

 అంబటి తాను దాఖలు చేసుకున్న పిటిషన్ లో తనకు ఇంటి భోజనం కావాలని కోరారు. అలాగే.. మంచం, పరుపు, దుప్పటి, దోమతెర, కూలర్, మందులు అందించాలని కోరారు. అలాగే తనకు ప్రత్యేక రూమ్ కేటాయించాలని రాంబాబు తన పిటిషన్ లో కోర్టును కోరారు.  ఆయన పిటిన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. అంబటిని  ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి,  మాజీ మంత్రికి చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.  

అంబటి  రాంబాబును తొలుత చంద్రబాబును అభ్యంతరకర పదజాలంతో దూషించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో బెయిలు వచ్చినా, అంబటిపై నమోదైన ఇతర ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికి అంబటి రెండు వారాలకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో సాధారణ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు.