TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Published on: Wed Oct 22, 2025 3:58PM

 

తెలంగాణలో అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని  సీఎం రేవంత్ రెడ్డి 
ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ ఆకస్మిక ఆదేశాలు జారీ చేశారు. 

చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై  వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు.

గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీంఅసిఫాబాద్ జిల్లాల్లోని తనిఖీ కేంద్రాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ అక్రమాలు జరుగుతున్నట్లు వారు గుర్తించారు. నిరంతర అవినీతి ఆరోపణలు, వాహనదారులు చెక్‌పోస్టుల వద్ద ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా నివారించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.