తైవాన్ విమాన ప్రమాదం: మృతులు 50 మంది
Published on: Wed Jul 23, 2014 7:46PM

తైవాన్‌లో ఓ విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మంది మరణించారు. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. తైవాన్‌లోని పెంఘు రాష్ట్రంలో ఈ విమానం కుప్పకూలింది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్ ఎయిర్లైన్ సంస్థ ట్రాన్సేషియా ఎయిర్వేస్కు చెందిన ఈ విమానాన్ని మాగాంగ్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలం కావడంతో విమానం కూలిందని తెలుస్తోంది.


