TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పైలట్ ట్రైనింగ్ కు వచ్చిన యువతిపై ట్రైనర్ అత్యాచారం

Published on: Wed Apr 8, 2026 1:13PM

హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యువతిపై ట్రైనర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసులు కథనం  ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు.

ట్రైనింగ్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా నసిముద్దీన్ ఆమెను బెదిరింపులకు గురి చేశారు.. రోజురోజుకీ అతని వేధింపులు, బెదిరింపులు మితిమీరిపోవ డంతో  యువతి భయంతో నివా సాన్ని మార్చి దమ్మయిగూడ కు వెళ్లిపోయింది.

అయిన ప్పటికీ వేధింపులు కొనసాగ డంతో చివరకు ఆ యువతి ట్రైనింగ్‌ను నిలిపివేసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన 2025లో బేగంపేట పరిధిలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు.