రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి..!
Published on: Wed Aug 5, 2026 8:20PM
.webp)
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలు విన్న కోర్టు రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని రేపు గురువారం అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
రెండు రోజుల కస్టడీ విచారణలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై జరిగిన వేధింపులు, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఇతర కీలక అంశాలపై పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించను న్నారు. కేసుకు సంబంధిం చిన పూర్తి వివరాలను రాబట్టడంతో పాటు డిజిటల్ ఆధారాలను సేకరించడంపైనా కూడా పోలీసులు దృష్టి సారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి ఉపయోగించిన మొబైల్ ఫోన్ పోలీసులకు లభించకపోవడం దర్యాప్తులో కీలకంగా మారింది.
ఆ ఫోన్ స్వాధీనం అయితే కాల్ డేటా, వాట్సాప్ చాట్‌లు, సందేశాలు, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా కేసులోని పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తు న్నారు. ముఖ్యంగా కస్టడీ విచారణలో మొబైల్ ఫోన్ ఆచూకీని రాబట్టడం, దానిని స్వాధీనం చేసుకోవడం, కేసుకు సంబంధించిన ఇతర సాక్ష్యాధారాలను సేకరించడంపై అత్తాపూర్ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల విచారణ అనం తరం కేసులో మరిన్ని కీలక విషయాలు బయ టపడే అవకాశముందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నారు.
Trainee IPS Uday Krishna Reddy, Police Investigation, Attapur Police, Cherlapalli Jail, CM Revanth Reddy


