రైలు ఛార్జీలు భారీగా పెంపు

 

నరేంద్రమోడీ ప్రభుత్వం రైలు ఛార్జీలు భారీగా పెంచింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డన పర్వం రైలు ఛార్జీలతో మొదలైంది. ప్రయాణికుల ఛార్జీలను 14.5 ఐదు శాతం పెంచారు. ఇది భారీ వడ్డనగానే భావించవచ్చు. అలాగే సరుకు రవాణా ఛార్జీలను 6.5 శాతం పెంచారు. దేశ ప్రధాని మోడీ కొన్ని రోజులుగా ప్రజలు త్యాగాలకు సిద్ధంగా వుండాలని, కొంతకాలం తాను కఠినంగా వ్యవహరించక తప్పదని చెబుతూనే వున్నారు. ఆయన చెప్పినమాట ఇప్పుడు రైలు ఛార్జీల రూపంలో అమలులోకి వచ్చింది.పెరిగిన రైలు ఛార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.