రైలు ప్రమాదాల నివారణకు రిమోట్ కంట్రోల్
Published on: Mon Oct 15, 2012 10:12AM
.png)
ఇకపై రైలు ప్రమాదాల జరగకుండా డ్రైవర్ మిషన్ ఇంటర్ పేష్ ( రిమోట్ కంట్రోల్ )పరికరంతో రెండు వేర్వేరు రైళ్ళలో అధికారులు చేసిన ప్రయోగం చేసి విజయవంతం అయ్యింది. రంగారెడ్డి జిల్లాలో బషీర్ బాగ్ రైల్వేస్టేషన్ల మద్య ఈ ప్రయోగం చేసిన రైల్వే అధికారులు త్వరలో రాష్ట్రంలోని అన్ని రైళ్లలో ప్రవేశపెడతామన్నారు. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లను పోనిచ్చి ప్రయోగం చేశారు. ఈ పరికరంతో ప్రమాదాన్ని పసిగట్టిన రైళ్లు రెడ్ సిగ్నల్ చూపుతూ హారన్ మోగుతూ డ్రైవర్ ను అప్రమత్తం చేసింది. దీంతో ఒకే పట్టాపై ఎదురుగా వస్తున్న రైళ్లు 500 మీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. ఈ పరికరాన్ని ట్రైన్ కొలీజియస్ అలైడ్ సిస్టం గా ( టిసి ఎ ఎస్ ) పిలుస్తారు. హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీ, రీసెర్చ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ( ఆర్ డియస్ ) సంయుక్తంగా ఈ పరికరాన్ని సమకూర్చారు.


