TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

28 కాదు 30 రోజులు.. మొబైల్ యూజర్లకు గుడ్​ న్యూస్​

Published on: Sat Jan 29, 2022 5:05PM

భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో టెలికాం ఆపరేటర్లకు షాక్ ఇచ్చింది. అదే సమయంలో మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ప్రీపెయిడ్ ప్యాకేజీల విషయంలో నెల రోజుల వ్యాలిడిటీని 28 రోజులకు బదులు కచ్చితంగా 30 రోజులు ఉండేలా చర్యలు తీసుకోవాలని షరతు విధించింది. దీంతో ఇకపై మొబైల్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీకి మరో రెండు రోజులు యాడ్ అయినట్లయింది. 

అయితే గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితోనే లభ్యమయ్యేవి. అయితే ఆ తర్వాత వాటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి టెలికాం సంస్థ కూడా 30 రోజుల కాలపరిమితితో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్‌ 1999కి మార్పులు చేస్తూ.. ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెలా ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే ఆ నెలంతా సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని  కూడా టెల్కోలను ఆదేశించింది. దీనిపై మొబైల్ వినియోగదార్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.