TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నారాయణగూడలో విషాదం.. మామిడి పండ్లు తిన్న అక్కాచెల్లెళ్లు మృతి

Published on: Wed Jun 10, 2026 9:38PM

హైదరాబాద్‌లోని నారాయ ణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం..    బీదర్‌కు చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి విఠల్‌వాడిలో నివసిస్తున్నారు. ఇటీవల వారి బంధువు రేణుక ఇంటికి వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసి తీసుకొచ్చింది. ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో పెద్ద కుమార్తె భువనేశ్వరి (17) సోమవారం మృతి చెందగా, చెల్లెలు సంధ్య (10) మంగళవారం  కన్నుమూసింది.

ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరో ఇద్దరు బాలికలు, తల్లి ఇంకా చికిత్స పొందుతున్నారు. మామిడి పండ్లు తినడం వల్లే ఈ ఘటన జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలు, వైద్య పరీక్షల అనంతరం అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన స్థానికులను కలచివేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.