కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
Published on: Wed Jun 17, 2020 5:36PM
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం నుంచి దాదాపు 30 మంది ట్రాక్టర్‌లో దైవదర్శ నానికి వేదాద్రి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కృష్ణా జిల్లాలో జిరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వాసులు దుర్మరణం చెందడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.


