గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మాదే.. ఉత్తమ్
Published on: Wed Dec 30, 2015 3:37PM
.jpg)
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను.. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసింది. నల్గొంగ, మహబూబ్ నగర్ రెండో స్థానం సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకాభిప్రాయం మేరకే టికెట్ల పంపిణీ జరుగుతుందని..జీహెచ్ఎంసీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్దం కావాలని పిలువునిచ్చారు. డివిజన్, బూత్ స్థాయి నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు మా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది అని.. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు.


