TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఈటలను బీజేపీలో చేర్చిందే కేసీఆర్! పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సంచలనం...

Published on: Sat Jun 26, 2021 10:05PM

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియమించబడిన కొద్ది సేపటికే సంచలనానికి తెర తీశారు ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తో పాటు బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చింది సీఎం కేసీఆరే అంటే సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ తో మాట్లాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ కేసీఆర్ సమకూర్చిందే అన్నారు. కేసీఆర్ సన్నిహితుడికి చెందిన విమానంలోనే కిషన్ రెడ్డి వచ్చి.. బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ను ఆహ్వానించారని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో వర్గపోరు లేదన్నారు. అభిప్రాయలు వేరువేరుగా ఉన్నాయే తప్ప విభేదాలు కావన్నారు. ఎవరూ ఏమైనా మాట్లాడే స్వేచ్చ కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ పదవి కావాలని ఎవరికైనా అడిగే హక్కు ఉంటుందన్నారు. ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలందరిని కలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ నేతలమంతా సమిష్టిగా పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తన కుటుంబ సభ్యులన్నారు రేవంత్ రెడ్డి. వీహెచ్ ను కలిసి మద్దతు కోరుతానని తెలిపారు.

కొన్నేళ్లుగా కేసీఆర్  సర్కార్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి... పీసీసీ చీఫ్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేయడమే తన లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. అరాచక పాలనకు చరమ గీతం పాటి... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తెస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.