TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ ర్యాలీ అదుర్స్‌.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ బెదుర్స్‌..

Published on: Wed Jul 7, 2021 11:38AM

టీవీల్లో చూసిన వారంతా షాక్‌. యూట్యూబ్ ఓపెన్ చేసిన వారంతా షేక్‌. ఏంద‌ది.. అస‌లేంద‌ది.. ఇంత‌కు ముందెప్పుడూ చూడ్లేదే.. ఏమి జ‌నం.. ఏమి జాత‌ర‌.. ఏమీ జ‌న‌జాత‌రా. లీడ‌ర్ అంటే అట్టుండాల‌. అభిమానులంటే ఇట్టే ఉండాల‌. అప్పుడే రాజ‌కీయాల్లో మ‌జా వ‌చ్చేది. ప్ర‌త్య‌ర్థుల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేది. 

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ప‌ట్టాభిషేకానికి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్‌ అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. జూబ్లిహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా గాంధీభ‌వ‌న్ చేరుకున్నారు. ర్యాలీ అంటే సింపుల్‌గా ర్యాలీ మాత్రం కాదు. అంత‌కుమించే. మొద‌ట రేవంత్ ఇంటి ద‌గ్గ‌ర వంద‌లాదిగా వాహ‌నాలు. కార్లు,, బైకుల్లో అభిమానాలు. రేవంత్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాగానే.. ఇక సంద‌డి షురూ. తీన్మార్ డ్యాన్సులు,, ఈల‌లు.. పాట‌లు.. గోల‌లు.. జూబ్లిహిల్స్‌లో రేవంత్‌ వైబ్రేష‌న్స్‌.....

రేవంత్‌రెడ్డి మీద రాసిన ఒక్కో పాట రోమాలు నిక్క‌బొడిచేలా ఉన్నాయి.. మైకుల్లో ఆ పాటలేసి.. రేవంత‌న్న ర్యాలీగా వ‌స్తుంటే.... నా సామి రంగ‌... అభిమానుల్లో పూన‌కమే... దారి పొడ‌వునా దండ‌లు.. దండాలే.. రేవంత్‌రెడ్డి వాహ‌నానికి.. ముందూ వెన‌కాలంతా జ‌న సందోహ‌మే... కారెన‌క కార్ల‌తో భారీ కాన్వాయ్‌.. బండెన‌క బండితో భారీ బైక్ ర్యాలీ... దారి పొడ‌వునా.. కాంగ్రెస్ జెండాల రెప‌రెప‌లే... రేవంత్‌రెడ్డిపై పూల వానే....

వాహ‌నం మీద నుంచి రేవంత్‌రెడ్డి అంద‌రికీ అభివంద‌నం చేస్తూ ముందుకు సాగారు.. న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి బైకుల‌పై త‌ర‌లివ‌చ్చిన యువ‌త‌.. రేవంత‌న్న సైన్యంగా ఆసాంతం ఆయ‌న్ను అనుస‌రించింది.. మొద‌ట వంద‌లాది మంది.. ర్యాలీ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ సంఖ్య వేల‌కు చేరింది.. ర్యాలీలో సిటీ యూత్ భారీగా పాల్గొంది.. ఇక తెలంగాణ‌లోని ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు సైతం వేల‌ల్లో గాంధీభ‌వ‌న్‌కు త‌ర‌లివ‌చ్చారు.. తెలంగాణ‌లోని అన్నిదారులు గాంధీభ‌వ‌న్ వైపే దారి తీశాయి.. ఆ దారుల‌న్నీ కాంగ్రెస్ జెండాల‌తో.. రేవంత‌న్న నినాదాల‌తో మారుమోగిపోయాయి...

ఇక్కడ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఒక‌ప్ప‌డు వైఎస్సార్ వెంట అనుంగ అనుచ‌రుడిగా ఉన్న సురీడు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డికి సైతం ప్ర‌ధాన సేవ‌కుడిగా మారాడు. ర్యాలీ ఆసాంతం సురీడు.. రేవంత్ వెన‌కాలే ఉండ‌టం చూసి.. రేవంత్ కూడా మ‌రో వైఎస్సార్‌లానే క‌నిపిస్తున్నారంటూ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.  

ముందుగా జూబ్లిహిల్స్ పెద్ద‌మ్మ త‌ల్లి ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ త‌ర్వాత నాంప‌ల్లి ద‌ర్గాలో ద‌ట్టీ క‌ట్టుకున్నారు.. చివ‌రాఖ‌రికి గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అడుగు....  టీవీల్లో, యూట్యూబ్‌లో.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ కోట్లాది మంది అభిమానులు రేవంత్‌రెడ్డి కార్య‌క్ర‌మాన్ని వీక్షించి.. పీసీసీ చీఫ్‌ ప‌ట్టాభిషేకాన్ని గ్రాండ్ స‌క్సెస్ చేశారు. 

ఇక్క‌డ హైద‌రాబాద్ రోడ్ల‌పై రేవంత్‌రెడ్డి ర్యాలీ ముందుకు సాగుతుంటే.. అక్క‌డ ప్ర‌జ‌ల్లో కేసీఆర్ ఇమేజ్ వెన‌కెన‌క్కి పోతోంది.. ఇక్క‌డ అభిమానుల నినాదాల‌తో గాంధీభ‌వ‌న్ హోరెత్తుతుంటే.. జై రేవంతన్న‌ నినాదాలు అక్క‌డ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో రీసౌండ్‌లో వినిపిస్తున్నాయి.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా గాంధీభ‌వ‌న్‌లో రేవంత్‌రెడ్డి వేసిన అడుగు.. భ‌విష్య‌త్‌లో అధిష్టించ‌బోయే ముఖ్య‌మంత్రి పీఠం వైపు తొలిఅడుగు అంటున్నారు. ఇక కాస్కో కేసీఆర్‌.. అప్నా టైమ్ ఆయేగా.. అంటూ రాజ‌కీయ న‌గారా మోగిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.