Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్.. ఇద్దరు దుర్మరణం
posted on: Jun 12, 2025 10:34AM

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలైన సంఘటన బుధవారం (జూన్ 11) జరిగింది. ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో రసాయిన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ విషవాయువులు లీకయ్యాయి.
ఆ సమయంలో ప్లాంట్ వద్ద తనిఖీ చేయడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరు కార్మికులు మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. పరవాడ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






