వైసీపీ సీనియర్ నేత మృతి
Published on: Fri Sep 12, 2025 7:19PM

వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూ ఆయన ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్శ్రాంతికి గురి చేసిందని, క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.‘ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశాస్తూ. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి బంధువు.


