పెద్దిరెడ్డి ప్రస్టేషన్.. ముందస్తు ముచ్చట.. కొవిడ్ కల్లోలం.. టాప్ న్యూస్@7PM
Published on: Sun Jan 9, 2022 6:03PM
మంత్రి పెద్దిరెడ్డి సీఎం కాలేదన్న ప్రెస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని టీడీపీ నేత కిషోర్‌కుమార్ దుయ్యబట్టారు.పెద్దిరెడ్డి సీఎం కావాలని కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్‌లో వైఎస్ సహా అందరు సీఎంలతో గొడవ పడ్డారని తెలిపారు. వైసీపీలో సీఎం కాలేనని పెద్దిరెడ్డికి అర్థమైందని చెప్పారు. కోట్ల అవినీతికి పాల్పడ్డ పెద్దిరెడ్డికి కన్నుమిన్ను కానడం లేదని కిషోర్‌కుమార్ మండిపడ్డారు.
---------
సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రపై ఏపీ ప్రభుత్వ వేధింపులు ఆగలేదు. ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు దేవాదాయశాఖ కమిషనర్ నోటీసులిచ్చింది. ట్రస్ట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని సెక్షన్ 43 ప్రకారం నోటీసులిచ్చారు. 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయాలని కమిషనర్ సూచించారు.
--------
జగన్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు.ప్రజలు పండగ సామన్లు కొనాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, నిత్యావసరాల ధరలు పెరిగాయని, స్వయంగా మంత్రే ఒప్పుకున్నారని పట్టాభి తెలిపారు. కమీషన్లు ముడితేచాలు ఏమైనా చేసుకోండి అనే తీరుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో మాజీ సీఎం జయలలిత ఏర్పాటు చేసిన.. అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ కొనసాగిస్తున్నారని తెలిపారు
--------
తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు.యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు. మహా సుదర్శన యాగం, మహా కుంభ సంప్రోక్షణ , తదితర క్రతువులు, ఆహ్వానాలు, ఏర్పాట్లపై సీఎం కేసీఆర్... చినజీయర్ స్వామి సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నారు. ఆశ్రమ సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇక్కడి యాగశాలను కూడా పరిశీలించారు.
-----
తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు మద్దతుగా హనుమకొండలో జరిగిన బీజేపీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బండి సంజయ్ పోరాటంలో న్యాయం ఉందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు హిమంత బిశ్వశర్మ. బీజేపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ హైద్రాబాద్ వస్తానన్నారు.
-------
తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాదు చైతన్యపురిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. హరీశ్ రావు కారు నుంచి దిగగానే పలువురు మహిళలు మాస్కుల్లేకుండా దర్శనమిచ్చారు. దాంతో ఆయన తన వద్ద ఉన్న మాస్కులను వారికి అందించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని, కొవిడ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన వారికి హితవు పలికారు.
------
ఏపీ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య వందల నుంచి వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. అయినా ఆరోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని వీడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి.
---
డిసెంబరు 26న జరిగిన పెసలపాడు ఎన్ కౌంటర్ బూటకం అని మావోయిస్టు అగ్రనేత జగన్ ఆరోపించారు. అమాయక ఆదివాసీలను కాల్చి చంపి ఎన్ కౌంటర్ అని కట్టుకథ అల్లారని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కారు, పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.సిరిసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డికి మావోయిస్టులు లేఖ రాసినట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అతడు తప్పుడు లేఖ అడ్డుపెట్టుకుని పోలీసుల రక్షణ కోరాడని మావోయిస్టు నేత జగన్ వివరించారు.
-----
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామాంజపురంలో ఓ కీచక హెడ్ మాస్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పాఠశాల ఉద్యోగి పెళ్లి చేసుకున్నాడు. ఆశీస్సుల కోసం హెడ్ మాస్టర్ వద్దకు వెళితే, ఆ కామాంధుడు ఆ ఉద్యోగి భార్యపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ నవవధువు తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఘటనపై విద్యార్థి, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి
------
కరోనా వైరస్ కొత్త రూపాంతరం డెల్టాక్రాన్‌ను మధ్య ప్రాచ్యంలోని సైప్రస్ దేశంలో గుర్తించారు. దీనికి డెల్టా వేరియంట్ వంటి జన్యు నేపథ్యం ఉంది.దీనిలో ఒమైక్రాన్ రూపాంతరంలోని కొన్ని మ్యుటేషన్స్ కూడా ఉన్నాయి. సైప్రస్‌లో పరీక్షించిన 25 నమూనాలలో 10 ఒమైక్రాన్ మ్యుటేషన్స్ కనిపించాయి. ఈ వైరస్ సోకి, 14 మంది సాధారణ వ్యక్తుల నుంచి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది నుంచి ఈ శాంపిల్స్‌ను సేకరించారు.
----


