TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీకి సీఎం.. అల్లర్లకు కుట్ర.. జైలుకు సంజయ్.. వైరస్ వర్రీ.. టాప్ న్యూస్@1PM

Published on: Mon Jan 3, 2022 11:53AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. మూడు రాజధానులు, పోలవరం,  విభజన హమీలు, ప్రత్యేక హోదాపై కేంద్రం పెద్దలతో సీఎం జగన్ చర్చిస్తారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఏపీ సమస్యలపై కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి-------

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పరిపాలన చేతగాక దుర్మార్గాలకు సీఎం జగన్ విధ్వంసాలకు పాల్పడుతున్నాడన్నారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దించి రాష్ట్రంలో విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారన్నారు. తాడికొండ, దుర్గి లలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం... చిత్తూరులో టీడీపీ దిమ్మె ధ్వంసం వంటి ఘటనలే దీనికి సాక్ష్యమని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

--------
ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నందమూరి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజలు దేవుడిగా ఆరాధించే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే... యావత్ తెలుగు జాతిని అవమానించినట్టేనని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే వైసీపీ నేతలు ఈ ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-------
అమరావతిని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిశానిర్దేశం లేకుండా పని చేస్తోందన్నారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ గోపయ్య దేవాలయం సందర్శించి సోము వీర్రాజు పూజలు నిర్వహించారు.
-------
వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఆధారాలు లేవు.. చంద్రబాబువి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా చెప్పారు. ఈ ఘటనపై సమగ్రంగా, లోతుగా విచారణ జరిపామని తెలిపారు. విజయవాడ పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు కూడా రెక్కీపై దర్యాప్తు చేశాయని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా  వెంటనే స్పందించిందని... రాధాకు గన్ మెన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. 
------
రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ అప్పులు, ఖర్చుల లెక్కలు రాశామని చెబుతున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న బుగ్గన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. 
---------
సీఎం జగన్ తీరు సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టుందని.. ప్రజాధనాన్ని ప్రభుత్వం  దుర్వినియోగం చేస్తోందని బీజేపీ నాయకుడు లంకా దినకర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రైతు భరోసా కోసం ఇచ్చే 13,500 రూపాయలలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కాదా? అని ప్రశ్నించారు. పీఏం కిసాన్ నిధులు కలిపి ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోవడం లో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 
-----
బీజేపీ తెలంగాణ‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదయింది. ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు. గ‌త ఏడాది నవంబరు 8న నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేసీఆర్‌పై ఆయ‌న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్‌ సందీప్‌ ఫిర్యాదు చేశారని, ఈ మేరకే తాము కేసు నమోదు చేశామ‌ని పోలీసులు చెప్పారు. 
--
మాజీ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు వైస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత్రి షర్మిల నేతృత్వంలో గట్టు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావన్నారు. టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్నారు. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదని తెలిపారు. 
----
దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య‌ వయసు కలిగిన పిల్లలకు నేటి నుంచి క‌రోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లో ఈ కార్యక్ర‌మాన్ని ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు.అర్హులైన పిల్ల‌లంద‌రికీ కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇస్తామ‌ని తెలిపారు