TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్ట్ అగ్రనేత సుజాత అరెస్ట్ 

Published on: Thu Oct 17, 2024 12:48PM

మావోయిస్ట్ పార్టీ  అగ్రనేత సుజాతను పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమె అరెస్ట్  ధృవీకరించచనున్నారు ఆమె భర్త  మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ  బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.  మావోయిస్ట్ మహిళా అగ్రనేతగా పేరుగాంచిన సుజాత కు కోటి రూపాయల రివార్డును ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.  చత్తీస్ ఘడ్ నుంచి ఖమ్మం వచ్చిన సుజాత  అనారోగ్యంతో బాధపడుతున్నారు.     ఆస్పత్రిలో చికిత్స పొందడానికే ఆమె  ఇల్లందు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న  వెంటనే  పోలీసులు ఆమెను  పట్టుకున్నారు. సుజాత  మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఇల్లందు నుంచి కొత్తగూడెంకు ఆటోలో వస్తుండగా  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మరో కథనం వినిపిస్తోంది.  చత్తీస్గడ్ ఇటీవలి కాలంలో  జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో సుజాత అరెస్ట్ మావోయిస్టులకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.