మావోయిస్ట్ అగ్రనేత సుజాత అరెస్ట్
Published on: Thu Oct 17, 2024 12:48PM
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సుజాతను పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసిన విషయాన్ని ధృవీకరించచనున్నారు ఆమె భర్త మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్ జీ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మావోయిస్ట్ మహిళా అగ్రనేతగా పేరుగాంచిన సుజాత కు కోటి రూపాయల రివార్డు ఉంది. చత్తీస్ ఘడ్ నుంచి ఖమ్మం వచ్చిన సుజాత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు పక్కా సమాచారం ఉంది. వెంటనే ఆమె పట్టుకున్నారు. సుజాత మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఇల్లందు నుంచి కొత్తగూడెంకు ఆటోలో వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చత్తీస్ గడ్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో సుజాత లొంగిపోవడానికి వచ్చినట్లు సమాచారం. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. అనారోగ్యంతో సుజాత బాధపడుతుందని పోలీసులకు అందిన సమాచారం.


