క్రిమినల్స్ లిస్టులో వుండాల్సింది కాంగ్రెస్‌వాళ్ళే



కేంద్ర ప్రభుత్వం మీద ఏ రకంగా దాడి చేయాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియడం లేదు. అందుకే ప్రధాని మోడీ మీద ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తూ దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ అంశమూ దొరకనట్టు నరేంద్ర మోడీ వేసుకునే సూటు మీద పడ్డాడు. మోడీ సూటు ఫలానా అంత ఖరీదైనది... దేశంలో అనేకమంది ఒంటినిండా బట్ట లేక అల్లాడుతుంటే అంత ఖరీదైన సూటు వేసుకోవడం న్యాయమా అని దిక్కుమాలిన లాజిక్కు లాగుతూ మాట్లాడాడు. అయితే ఆయన  దేశంలో అనేకమంది ఒంటిమీద బట్ట లేకుండా అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరచిపోయినట్టున్నాడు. రాహుల్ గాంధీ చేస్తున్న విష ప్రచారాన్ని నరేంద్రమోడీ సమర్థంగా తిప్పికొట్టాడు. కాంగ్రెస్ నాయకులు అందుకున్న సూట్ కేసుల కంటే తన సూటే బెటరన్నట్టుగా కౌంటర్ ఇచ్చేసరికి కాంగ్రెస్ నాయకులు కిక్కురుమనకుండా ఊరుకున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మరో విష ప్రచారం మొదలుపెట్టారు. గూగుల్‌లో టాప్ 10 క్రిమినల్స్ అని టైప్ చేస్తే నరేంద్రమోడీ ఫొటో కూడా కనిపిస్తోందట. అలా కాంగ్రెస్ పార్టీవాళ్ళే అరేంజ్ చేశారో... మరెవరు అరేంజ్ చేశారోగానీ, అలా కనిపించడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పండగొచ్చినట్టుగా వుంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాంఛి రసికుడు అయిన దిగ్విజయ్ సింగ్ దీనిని ఒక పెద్ద ఇష్యూ చేసే బాధ్యతను తన భుజాన వేసుకుని ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యాడు. ఇలా టాప్ 10 క్రిమినల్స్ అని టైప్ చేస్తే నరేంద్రమోడీ కనిపించడం అవమానమని, తాను సిగ్గుతో తల దించుకుంటున్నానని ఏవేవో వెటకారం కామెంట్లు పోస్టు చేశాడు. నిజానికి టాప్ టెన్ క్రిమినల్స్‌ లిస్టులో వుండాల్సింది నరేంద్రమోడీ కాదు.. ఇలాంటి చీప్ ప్రాపగాడా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu