3 నెలలుగా నాన్‌స్టాప్ వీడియో గేమ్స్.. పిచ్చోడైన కుర్రాడు.. బీ అలర్ట్..
Published on: Fri Feb 4, 2022 9:46AM
అసలే కరోనా టైమ్. జనాలు ఇంటిపట్టునే ఉంటున్నారు. టైంపాస్ కాక బోర్‌గా ఫీల్ అవుతున్నారు. టీవీ చూద్దామంటే ఎప్పుడూ అవే బోరింగ్ బ్రేకింగ్స్. బయటకు వెళ్దామంటే కొవిడ్ భయం. అందుకే, టైంపాస్‌కు వీడియో గేమ్‌ల మీద పడ్డారు జనాలు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఈమధ్య చాలామంది అదే పనిగా వీడియో గేమ్స్ ఆడేస్తున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్. కావలసినంత డేటా. ఇంకేం.. యాప్ డౌన్‌లోడ్ చేసేసి.. తెగ ఆడేస్తున్నారు. ఫ్రీ ఫైర్ లాంటి వార్ గేమ్స్‌తో పాటు రేజింగ్ గేమ్స్‌ను యమ క్రేజీగా ఆడుతున్నారు. గ్రూపులుగా ఏర్పడి.. పోటాపోటీగా సెల్‌ఫోన్‌లో ఆటాడుకుంటున్నారు.
వీడియో గేమ్స్ కొందరిలో వ్యసనంగా మారిపోతోంది. లేచింది మొదలు.. పడుకునే వరకూ.. నాన్‌స్టాప్‌గా గేమ్ ఆడుతున్నారు కొందరు. మరికొందరైతే తిండి, నిద్ర కూడా మరిచిపోతున్నారు. మొబైల్‌తోనే బతికేస్తున్నారు. అదికాస్తా.. విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. మెడ నరాల ప్రాబ్లమ్.. అనారోగ్యం తదితర సమస్యలకు దారితీస్తోంది.
తాజాగా, సెల్‌ఫోన్‌లో అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. అనంతపురం కనేకల్ మండలం బెనకలు కు చెందిన మహేశ్.. గత 3 నెలలుగా నిద్రలేకుండా కంటిన్యూయస్‌గా ఆన్‌లైన్ గేమ్స్ ఆడాడు. దీంతో మహేశ్ ఆరోగ్యం క్రమంగా క్షీణించిం.. పిచ్చోడయ్యాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఆందోలన చెందిన మహేశ్ పేరెంట్స్.. కొడుకును ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ జాగ్రత్తేదో ముందే ఉంటే బాగుండుగా. మరీ, అంత టూమచ్‌గా నిద్ర పోకుండా వీడియో గేమ్స్ ఆడటమేంటి? అతను అలా ఆడుతుంటే.. వాడిని అలా వదిలేయడమేంటి? అని తప్పుబడుతున్నారు స్థానికులు.


