రెండ్రోజుల్లో టన్నెల పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Published on: Wed Feb 26, 2025 5:53PM
ఎస్ ఎల్ బిసీ(శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్ ) టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని కార్మికులనందరినీ బయటకు తీసుకువస్తామని భరోసా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా టన్నెల్ ప్రమాదాలు జరిగినా అవసరమైన నిపుణులను పిలిపిస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే విదేశాల్లో ఉన్న నిపుణులను పిలిపిస్తామన్నారు. ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికుల జాడ ఐదు రోజులైనా దొరకలేదు.


