TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త సంవత్సరం హీరోయిన్ల రేట్లు

Published on: Sat Dec 7, 2013 3:30PM

 

గతకొద్దికాలంగా సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేటి యువ హీరోయిన్లకు అప్పుడప్పుడు మాత్రమే ఏవో చిన్న చిన్న పాత్రలు మాత్రమే దక్కుతున్నాయి. వీటివల్ల వీరికి ఎలాంటి లాభాలు రావడం లేదు. అయితే ప్రతి వ్యాపారికి ఎదో ఒక సీజన్ లో మాత్రమే చాలా ఎక్కువగా లాభాలు వస్తుంటాయి. కానీ సినిమా హీరోయిన్లకు ఎప్పుడు ప్రోగ్రాం ఉన్నా కూడా లాభాలే.

 

సినిమాల్లో అవకాశాలు రాకపోయినా కూడా ఈ స్టేజ్ షో ల వలన వీళ్ళు బాగానే సంపాదిస్తున్నారు. ఒక్కరోజుకి 5 లక్షలకు పైగా వసూళ్ళు చేస్తున్నారు. కామ్నా జెట్మలాని, పూనమ్ కౌర్, మధుశాలిని, అర్చన, సంజన, నిఖిత, పాయల్ ఘోష్, శ్వేతాబసు ప్రసాద్ వంటి హీరోయిన్లు 5 లక్షల వరకు వసూళ్ళు చేస్తున్నారు. ఛార్మి, ప్రియమణి, నవనీత్ కౌర్, నిఖిషా పాటెల్, వంటి హీరోయిన్లు 10 లక్షలకు పైగా వసూళ్ళు చేస్తున్నారు. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న లేటెస్ట్ కుర్ర హీరోయిన్లు సైతం మరింత రేటుని పెంచి మరీ ఈ షోలను ఎంజాయ్ చేస్తున్నారు.

 

మరి ఈ కొత్త సంవత్సరం వేడుకలకు ఎంత మంది హీరోయిన్లు తమ డేట్స్ ను కేటాయించారో... ఎంతమంది హీరోయిన్లకు ఎన్ని లక్షల లాభాలు వస్తాయో, ఎంతమంది ఈ షో ల ద్వారా స్లిమ్ అవుతారో చూడాలి.