సినిమావాళ్ళ చెవిలో పువ్వెట్టి మాయమైన బాబా!
Published on: Wed Apr 16, 2014 5:02PM

టీవీ వాళ్ళని చిట్టీల పేరుతో మోసం చేసిన విజయరాణి ఉదంతం ఇంకా ఒక కొలిక్కి రాకముందే, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి మరో మోసం వెలుగులోకి వచ్చింది. సినిమా పరిశ్రమలో కెమెరామన్‌గా పనిచేస్తున్న బాబా అనే వ్యక్తి చిట్టీల పేరుతో రెండు కోట్లకు పైగా డబ్బు వసూలు చేసి బిచాణా ఎత్తేసినట్టు సమాచారం. గత పది రోజులుగా బాబా అడ్రస్ గల్లంత్ కావడంతో బాబాకి డబ్బు చెల్లించిన వారు బాబోయ్ అనుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.


