డ్రగ్స్ కేసులో దొరికిన సినీ నటుడు అభిషేక్
Published on: Sat Dec 8, 2012 2:58PM
.jpg)
డ్రగ్ రాకెట్ మళ్లీ టాలీవుడ్ ను తాకింది. తాజాగా మరో నటుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబట్టాడు. ఐతే సినిమాతో పరిచయమై నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం వంటి సినిమాల్లో నటించిన అభిషేక్ డ్రగ్స్ తో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో హీరో రవితేజ సోదరులు ఈ వివాదంలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులకు అభిషేక్ను హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ వద్ద పట్టుకున్నారు. అతని నుంచి పది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిషేక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాడు.


