TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజలకోసం తర్వాత... ముందు మన విషయం...

Published on: Sat Sep 29, 2012 8:02AM

Tollgate Charges, Demand,  Ex-MLA', Mandal Members, Exempted, Milk Vendor's, Motor Bike Rider's, Middle and Lower Middle,

 

రాష్ట్ర పరిధిలో నిర్వహిస్తున్న టోల్‌గేట్ల నుండి మాజీ శాసనసభ, మండలి సభ్యులకు టోల్‌ రుసుము మినహాయించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ శాసనసభ్యుల ఫోరం కార్యదర్శి కోరారు. సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మాజీలు కనుక టోల్‌గేట్‌ రుసుము నుండి తగ్గించమని అడిగారు. అయితే అసెంబ్లీకి ఎన్నికయ్యే వారిలో ఒకప్పటివారి సంగతి ఏమోకాని ఇప్పటివారిలో ఎంతమంది కేవలం ధనవంతుల్లా కాకపోయినా మధ్యతరగతివారిలా జీవనం సాగిస్తున్నారు... చెప్పడం కష్టం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికై మాజీలైనవారిలో ఎందరో ధనవంతులున్నారు. పలురకాల వ్యాపారాలున్నాయి. అటువంటివారు టోల్‌గేట్‌ రుసుము తగ్గించమనడం ఎంతవరకు సమంజసం. ఇంటింటికి తిరిగి మోటార్‌ బండ్లపై పాలమ్ముకునే సామాన్య పాలవ్యాపారస్తులు... వంటి వారికి, ఉద్యోగం మీద ఆధారపడి ప్రయాణించే మధ్యతరగతి , సామాన్యులకు టోల్‌గేట్‌ రుసుము నుండి మినహాయిస్తే కనీసం అవి వారి పిల్లల పుస్తకాలకైనా ఉపయోగపడుతుంది. గౌరవనీయులైన శాసనసభ్యులు ప్రజలకోసం అడగకుండా కేవలం తమకోసంమాత్రమే ఇలాఅడగటం ఎంతవరకు సమంజసం...? అన్నది ప్రజల ప్రశ్న! టోల్‌గేట్‌ రుసుము వసూలు చేసేదే ప్రజలకోసమని, వారి అవసరాలకోసమని చెబుతుంటారు నాయకులు.. ఇలా ఎవరికివారు మినహాయింపులు పుచ్చుకుంటే... చివరకు మిగిలేది, టోల్‌గేట్‌ రుసుముకు బలయ్యేది సామాన్యుడే గదా...నంటూ సగటుమనిషి తమ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.