TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెన్నైలో బస్సు దొంగతనం.. ఆత్మకూరులో అరెస్ట్

Published on: Fri Sep 12, 2025 9:45AM

చెన్నై లో  తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సును దొంగిలించిన వ్యక్తి ఆత్మకూరులో పట్టుబడ్డాడు. విషయమేంటంటే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన  రంజన్ సాహు అనే వ్యక్తి చెన్నైలోని కొయ్యం బెడ్ వద్ద నిలిపి ఉంచిన తమిళనాడు ఆర్టీసీ బస్సును దొంగిలించి.. అక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ.. ఆ రాష్ట్ర సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాడు.

కాగా నిలిపి ఉంచిన బస్సు కనిపించకపోవడంతో తమిళనాడు ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన చెన్నై పోలీసులు బస్సు ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు వైపుగా వెడుతున్నట్లు గుర్తించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో ఆత్మకూరు అలర్ట్ అయ్యారు.   నెల్లూరుపాలెం వద్ద ఆ బస్సును పట్టుకుని  ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు తరలించి.. విషయాన్ని చెన్నై పోలీసులకు తెలిపారు. దీంతో చెన్నై పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఆత్మకూరు వచ్చి బస్సును దొంగిలించిన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని..  టీఎన్ఆర్టీసీ బస్సును చెన్నై తీసుకువెళ్లారు.