కోదండరాం కొత్త పార్టీ ఖరారు..


తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొత్త పార్టీ పెడుతున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. కోదండరాం కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. దీనిపై కోదండరాం మాట్లాడుతూ...ఫిబ్రవరి నెలలో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ జన సమితి అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. కాగా గత కొద్దికాలంగా కోదండరాం కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇద్దరూ కలిసి పనిచేసినా..కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత కొద్ది కాలానికే కోదండరాం... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చెయ్యడం మొదలుపెట్టారు.  మొదట్లో కొంత ఉపేక్షించినా తరువాతి కాలంలో తెరాస ఆయనను కూడా విమర్శించడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆయన ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండటంతో తమిళనాడు రాజకీయాలు మరింత ఇంట్రస్టింగ్ గా మారాయి. మరి తెలంగాణాలో బలంగా ఉన్న కేసీఆర్ కు ఆయనకు పోటీ ఇస్తారో...? లేదో...? చూద్దాం...