TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల-తిరుపతిలో భారీ వర్షం

Published on: Sun Nov 22, 2015 6:35AM

 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల - తిరుపతిలో వర్షం భారీగా కురుస్తోంది. తిరుమల మాడ వీధులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే వుంది. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్ళలోకి నీరు చేరింది. గోవిందరాజ స్వామి ఆలయం రెండో సత్రంలోకి వరద నీరు చేరింది. చంద్రగిరి మండలంలోని భీమవరం, పులిట్టివారిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.