TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చదలవాడకు గాలి మద్దతు?

Published on: Wed Mar 28, 2012 11:31AM

తిరుపతి మాజీ ఎమెల్యే చదలవాడ కృష్ణమూర్తి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. అయితే చదలవాడ రీ ఎంట్రీ వెనుక మాజీ మంత్రి, శాసనసభ్యుడు అయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. చదలవాడ 2003 ఎమ్మెల్యేగా ఉండగానే చంద్రబాబు నాయుడుతో పాటు అలిపిరితో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ మరుసటి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మంత్రి బొజ్జల కారణంగా చదలవాడ తిరిగి టిక్కెట్ ను పొందలేకపోయారు. అనంతరం కొద్ది సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 

2009 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తిరుపతి టిక్కెట్కోసం ప్రయత్నించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడుతో సన్నిహితంగానే ఉంటూ వచ్చారు. ఈ సాన్నిహిత్యమే చదలవాడకు ప్రస్తుతం కలిసివచ్చింది. ముద్దుకృష్ణమనాయుడి సహాయ సహకారాలతో చదలవాడ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ను కూడా ఆయనకే కట్టబెట్టాలనుకుంటున్నారు. మరో 10 రోజుల్లో తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబునాయుడు చదలవాడ పేరును ప్రకటించే అవకాశం ఉంది.