తిరుపతి కాంగ్రెస్ లో కొనసాగుతున్న అలకలు
Published on: Sun Jun 10, 2012 12:44PM
తిరుపతి కాంగ్రెస్ పార్టీలో గతంలో కన్నా ఐక్యత సాధించామని ఆ పార్టీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కోపం తీరక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుంటు౦బ సభ్యులు ఇంకా పార్టీ ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. అంటే అలక కొనసాగిస్తూనే ఉన్నారు. పార్టీ నేతల ముందు మాత్రం పెద్దిరెడ్డి తాను కాంగ్రెస్ అభ్యర్ధి ఎం. వెంకటరమణకు మద్దతిస్తామన్నారు. కానీ, వాస్తవానికి ఆయన ఏమి చేయలేదు. ఈ విషయాన్ని వెంకటరమణ తరుచూ గుర్తు చేస్తూనే ఉన్నారని సమాచారం. ఇక మబ్బు సుబ్బిరామిరెడ్డి కుటుంబంలోని చెంగారెడ్డి తదితరులు అసలు ప్రచారచాయల్లోకే రాలేదు. మంత్రి గల్లాఅరుణకుమారి కుడా తన భర్త అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉద్యోగులకు వెంకటరమణ ఓటెయ్యమని సూచించలేదు.


