TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో రాజకీయ సందడి

Published on: Mon Mar 19, 2012 12:47PM

తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి రాజ్యసభకు వెళ్ళడం ఖాయమని తేలడంతో తిరుపతిలో రాజకీయ సందడి ప్రారంభమైంది. ఆయన రాజ్యసభకు వెళ్ళడం ద్వారా ఖాళీ అయ్యే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి పోటీచేయడం ఖాయం. ఇప్పటికే ఆయన డివిజన్లవారీగా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి విషయానికి వస్తే ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తి జ్వాలలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పేరున్న, ప్రజాదరణగల పార్టీ నాయకులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో ఒక మోస్తరు నాయకులంతా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చదలవాడ సుచరిత, డాక్టర్ సుధారాణి, ఓవి రమణ తదితరులు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేయడానికి అనేకమంది ఉత్సాహపడుతున్నారు. నిజానికి చిరంజీవి తన సతీమణి సురేఖను ఇక్కడ పోటీకి నిలపాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడి పరిస్థితులు తనకు అంత అనుకూలంగా లేవన్న విషయాన్ని చిరంజీవి గమనించినట్లు తెలిసింది. మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు జయదేవ్, చిరంజీవి మద్దతుదారులైన డాక్టర్ హరిప్రసాద్, ఎస్.వి.ప్రసాద్ ఈ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.