TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు

Published on: Mon Oct 6, 2025 3:18PM

 

ఏపీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీసులకు మెయిల్ పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఆ బెదిరింపు ఈమెయిల్ లో హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. కాలేజి వద్ద హెలిప్యాడ్ పరిసరాల్లో అణువణువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 

ఓ ఫ్యామిలీ ప్రోగ్రాం కోసం ముఖ్యమంత్రి కుటుంబం స్వగ్రామం నారావారిపల్లె వస్తున్నారు. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె చేరుకోనుండగా... సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి వస్తున్నారు. ఆయన రాక కోసం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.