అసంతృప్తిగా ఉన్న మాట నిజం: చిరు
Published on: Fri Dec 23, 2011 9:07AM
తిరుప
తి : పదవులు విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని ,రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండాలన్నదే తన ఆలోచన అని, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. తనకు పదవి రానందుకు తమ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన శుక్రవారమిక్కడ అంగీకరించారు.తుపాకుల మునెమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆమె వ్యక్తిగత అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఇందులో తప్పేమీ లేదని చిరంజీవి అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని టార్గెట్ చేయటం కోసమే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసారనటం వాస్తవం కాదని చిరంజీవి అన్నారు.


