TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో తగ్గుతున్న పోలింగ్ శాతం, ఆందోళనలో అభ్యర్థులు

Published on: Mon Jun 4, 2012 3:40PM

tirupathi byelections, tirupathi bypolls, tirupathi 12 june bypoll, tirupathi voting percentage, tirupathi polling percentage, tirupathi bypolls voting, tirupathi voting in byelections, tirupathi byelection polling percentageసాధారణ ఎన్నికలంటే ఆసక్తి చూపే తిరుపతి ఓటరు ఉప ఎన్నికలపై అంతగా దృష్టి సాధించదు. అందువల్ల ప్రతీసారి ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పడిపోతూ వస్తోంది. 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాక జరిగిన సాధారణ ఎన్నికల్లో 70.79శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తరువాత ఆయన రాజీనామా చేయడంతో అదే సవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో 59.54శాతం పోలింగ్ నమోదైంది. అంటే 11.25శాతం ఓటింగ్ తగ్గింది. మళ్లీ ఇప్పుడు ఉప ఎన్నికలొచ్చాయి. 2009లో సాధారణ ఎన్నికలప్పుడు నమోదైన పోలింగ్ శాతం 51.64శాతం. 1983నాటి చేదు అనుభవం ఓటర్ల నుంచి ఎదురైతే ఈ ఉప ఎన్నికలను విశ్లేషించటమే కష్టమని పరిశీలకులు భావిస్తున్నారు.

అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలూ కూడాప్రతీగడపనూ వదలకుండా ప్రచారం చేస్తున్నాయి. దీని వల్ల ఓటింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా కనీసస్థాయి జరుగుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఒక వేల ఓటింగ్ శాతం పడిపోతే మాత్రం మెజార్టీ తగ్గడమే కాకుండా ఫలితాలు కూడా మారే అవకాశముందని పరిశీలనలో తేలుతోంది. దీంతో అభ్యర్థులందరూ ఈ కొత్త విషయంపై దృష్టి సారించి ఓటర్లను ఖచ్చితంగా పోలింగ్ లో పాల్గొనాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ఓట్లతో పాటు పోలింగ్ గురించి కూడా విజ్ఞప్తి చేయటం ఓటరును ఆకట్టుకుంటోదని పరిశీలకులు భావిస్తున్నారు.