TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అభ్యర్దులను కూడా గుర్తు పట్టలేకపోతున్న కిరాయి కార్యకర్తలు !

Published on: Mon Jun 4, 2012 3:59PM

tirupathi byelection, tirupathi congress candidate, tirupathi ysr congress candidate, bhumana karunakar reddy congress workers, m venkataramana tirupati congress candidate, tirupati bypolls 12 june, tirupati byelections 12 juneప్రస్తుత ఉప ఎన్నికల్లో కిరాయి కార్యకర్తల జోరు పెరిగిపోయింది. డబ్బులు తీసుకుని తమతమ ప్రాంతాల్లో టెంట్లు వేస్తూ అభ్యర్దులు  వచ్చినప్పుడు వారికి ఘనంగా స్వాగతం పలకడం, తమ వార్డుల్లో అభ్యర్దులను తిప్పడం ఈ కిరాయి కార్యకర్తల ప్రధానమైన పని. అయితే ఎవరు డబ్బిస్తే వారి వెంట తిరుగుతున్న ఈ కార్యకర్తలు ఒక్కోసారి తాము ఎవరి తరపున ప్రచారం చేస్తున్నామో కూడా మర్చిపోతున్నారు. ఇటువంటి సంఘటనే తిరుపతిలో జరిగింది.

తిరుపతిలో ఈ కిరాయి కాంగ్రెస్ కార్యకర్తలు తమ అభ్యర్థి ఎం.వెంకరమణ అనుకుని వై.కా.పా. అభ్యర్థి భూమాన కరుణాకరరెడ్డిని పూలతో ముంచెత్తారు. ఆ తరువాత జరిగిన తప్పు తెలుసుకుని నాలిక్కరుచుకుని  భూమానకు జల్లిన పూలను తిరిగి బుట్టలోకి ఏరి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణపై జల్లేశారు. హమ్మయ్య! వెంకటరమణ చూడలేదు కాబట్టి సరిపోయిందని కార్యకర్తలు సర్దుకున్నారు. ఈ సంఘటన తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దకాపు లే - అవుట్ సందులో జరిగింది. కానీ, తనకు ఇంత ఆదరణా అని భూమాన కొద్దిసేపు ఆశ్చర్యపోయేలా కాంగ్రెస్ కార్యకర్తలు మిద్దెలపై నుంచి పూలు కురిపించారు. తిరిగి ఆ పూలే వెంకటరమణ పైనా కురిపించారు. ఒకే పూలతో ఇద్దరు అభ్యర్దులను సంతృప్తి పరిచిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కింది కదూ!