TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజాసింగ్ హెచ్చరిక!

Published on: Thu Sep 26, 2024 2:19PM

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ విషయమై ఆయన స్పందిస్తూ.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు తిరుమల వెడితే  హిందువులు ఏకమై వారిని  చంపేస్తారని హెచ్చరించారు.  హిందువుల మనోభావాలు అందరూ గౌరవించాల్సిందేనని, ఇందులో ఎటువంటి మినహాయింపూ లేదని  రాజా సింగ్ స్పష్టం చేశారు.  హిందువులను చులకన చేసినా, తప్పుగా మాట్లాడినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.  తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని  రాజాసింగ్ డిమాండ్ చేశారు.