TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Mon Jul 24, 2023 9:50AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పదిగంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 87వేల792 మంది దర్శించుకున్నారు.

29వేల 656 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.2 కోట్ల రూపాయలు వచ్చింది.